చరణ్ తో చేసే సినిమా నా డ్రీమ్ ప్రాజెక్ట్ అంటున్న డైరెక్టర్!

Charan in Goutham movie update
  • ఫస్టు మూవీగా చేసిన 'జెర్సీ'
  • అదే సినిమా హిందీలోకి రీమేక్ 
  • త్వరలోనే చరణ్ తో సెట్స్ పైకి 
  • చరణ్ కి ఇది 16వ సినిమా
బలమైన కథాకథనాలతో చేసే సినిమాలు ప్రేక్షకులకు చాలాకాలం పాటు గుర్తుండిపోతాయి. 10 సినిమాలు చేయడం వలన వచ్చే గుర్తింపు ఇలాంటి ఒక సినిమా చేస్తేనే వచ్చేస్తూ ఉంటుంది. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి విషయంలోను అలాగే జరిగింది. తొలి ప్రయత్నంగా ఆయన తెరకెక్కించిన 'జెర్సీ' ఆడియన్స్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అయింది. 

ఇదే సినిమాను ఆయన హిందీలో షాహిద్ కపూర్ తో రూపొందించగా, ఏప్రిల్ 14వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఆ తరువాత సినిమాను ఆయన చరణ్ తో చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే అది ఖరారేనా? అనే సందేహమే అభిమానుల్లో కనిపిస్తోంది. తాజాగా ఒక అభిమాని అడిగిన ప్రశ్నతో క్లారిటీ వచ్చేసింది.

'చరణ్ తో మంచి సినిమా చేయాలి ... ఆయన క్యారెక్టరైజేషన్ అదిరిపోవాలి' అని అభిమాని అడిగితే, చరణ్ తో సినిమా నా డ్రీమ్ .. ఆయన సినిమా కోసం నా వైపు నుంచి ది బెస్ట్ ఇస్తాను" అని చెప్పుకొచ్చాడు. దాంతో చరణ్ తన 16వ సినిమాను గౌతమ్ తిన్ననూరితోనే చేయనున్నాడనే విషయంలో స్పష్టత వచ్చేసింది.
Go Back to Shorts
Ramcharan
Goutham Thinnanuri
Tollywood

More Telugu News