mohan: జానపద గాయకుడు జటావత్‌ మోహన్ ఆత్మహత్య

singer mohan commits suicid
  • చంపాపేటలో ఉంటోన్న‌ సింగర్‌ మోహన్ 
  • స్వ‌స్థ‌లం నల్ల‌గొండ‌ జిల్లా పల్లిగుండ్ల తండా 
  • కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు
హైదరాబాద్ లో ఓ జాన‌ప‌ద గాయ‌కుడు ఆత్మహ‌త్య చేసుకోవ‌డం కలకలం రేపింది. చంపాపేటలో ఉంటోన్న‌ సింగర్‌ జటావత్‌ మోహన్ త‌న గ‌దిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నల్ల‌గొండ‌ జిల్లా తిరుమలగిరి సాగర్‌ మండలం పల్లిగుండ్ల తండా మోహన్‌ స్వస్థలం. కొంత కాలంగా హైద‌రాబాద్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని ఆయ‌న ఉంటున్నాడు. 

గ‌త‌ రాత్రి తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రోజు ఉదయం ఈ విష‌యాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుప‌త్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు  ప్రారంభించారు. ఆయన మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మోహన్ యూట్యూబ్‌లో బంజారా పాట‌లు పాడి మంచి పేరు తెచ్చుకున్నారు.
mohan
singer

More Telugu News