ఇక కాంగ్రెస్ వంతు.. రేవంత్‌కు వ్యతిరేకంగా కీలక నేతల భేటీ
- శశిధర్ రెడ్డి ఇంటిలో భేటీ
- సెంటరాఫ్ అట్రాక్షన్‌గా జగ్గారెడ్డి, వీహెచ్
- మాజీ మంత్రులు శ్రీధర్ రెడ్డి, పొన్నాల, గీతారెడ్డిల హాజరు
పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఇంటిలో జరిగిన ఈ భేటీకి రేవంత్ తీరును బహిరంగంగానే వ్యతిరేకిస్తూ వస్తున్న సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి), మాజీ ఎంపీ వి.హన్మంతరావు, మాజీ మంత్రులు గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పార్టీ సీనియర్ నేత కోదండ రెడ్డిలతో పాటు మరికొందరు నేతలు హాజరైనట్టు తెలుస్తోంది.
సీనయర్లను పట్టించుకోకుండా రేవంత్ వ్యవహరిస్తున్న తీరుపై ఈ భేటీలో చర్చ జరగ్గా.. ఈ అంశంపై త్వరలోనే పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్టుగా సమాచారం. మొత్తంగా టీపీసీసీ చీఫ్ రేవంత్‌కు వ్యతిరేకంగా జరిగిన ఈ భేటీపై ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోంది.