ప్రమాదవశాత్తు మరణించిన అభిమాని కుటుంబానికి ప్రభాస్ ఆర్థికసాయం
- ఈ నెల 11న విడుదలైన రాధ్యేశామ్
- కారంపూడిలో బ్యానర్ కడుతూ అభిమాని మృతి
- విద్యుదాఘాతానికి గురైన చల్లా పెదకోటి
- పెద్దమనసుతో స్పందించిన ప్రభాస్
కారంపూడి మండల ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చల్లా అనిల్ ద్వారా ఈ విషయం ప్రభాస్ కు తెలిసింది. ఈ ఘటన పట్ల ఆయన చలించిపోయారు. వెంటనే రూ.2 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. తాజాగా, రూ.2 లక్షల చెక్కును మృతుడు చల్లా పెదకోటి భార్య పిచ్చమ్మకు అందించారు.