మంచిర్యాల జిల్లాలో దారుణం.. తహసీల్దార్ కార్యాలయంలోనే వీఆర్ఏ దారుణహత్య
- మంచిర్యాల జిల్లా కన్నెపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఘటన
- రక్తపుమడుగులో పడివున్న వీఆర్ఏను గుర్తించిన స్థానికులు
- కార్యాలయంలోనే హత్యచేసి పరారైన దుండగులు
రక్తపు మడుగులో విగతజీవిగా పడివున్న దుర్గంబాబును గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.