నటుడు విశాల్ రూ. 15 కోట్లు డిపాజిట్ చేయాల్సిందే..మద్రాస్ హైకోర్టు ఆదేశం
- లైకా సంస్థ నుంచి రూ. 21.29 కోట్ల అప్పు
- ఒప్పందం ప్రకారం ముందుగా చెల్లించకుండానే సినిమా విడుదలకు రెడీ
- మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన ‘లైకా’
సినిమాను విడుదల చేయడమే కాకుండా శాటిలైట్, ఓటీటీ హక్కులను కూడా అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. కాబట్టి సినిమా విడుదల, హక్కుల విక్రయంపై నిషేధం విధించాలని కోరింది. నిన్న ఈ కేసు విచారణకు వచ్చింది. వాదనలు విన్న జస్టిస్ సెంథిల్ కుమార్ రామమూర్తి.. విశాల్ రూ. 15 కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 22వ తేదీకి వాయిదా వేసింది.