Raviteja: ఫస్ట్ క్లాస్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన రవితేజ

Hyderabad cricketer Raviteja retires from cricket
  • హైదరాబాద్, మేఘాలయ జట్లకు కెప్టెన్ గా వ్యవహరించిన రవితేజ
  • భారత్ తరపున అండర్-19, ఇండియా-ఏ జట్లకు ప్రాతినిధ్యం
  • 16 ఏళ్ల పాటు కొనసాగిన రవితేజ కెరీర్
హైదరాబాద్ మాజీ క్రికెట్ కెప్టెన్ ద్వారకా రవితేజ ఫస్ట్ క్లాస్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. రవితేజ ఫస్ట్ క్లాస్ కెరీర్ 16 ఏళ్ల పాటు కొనసాగింది. హైదరాబాద్, మేఘాలయ జట్లకు ఆయన ప్రాతినిధ్యం వహించాడు. అంతేకాదు టీమిండియా అండర్-19 జట్టుకు, ఇండియా-ఏ జట్టుకు ఆడాడు. 

రవితేజ తన చివరి మ్యాచ్ ను ప్రస్తుతం జరుగుతున్న రంజీట్రోఫీలో ఆడాడు. గుజరాత్ తో మేఘాలయ తరపున ఆడిన రవితేజ 133 పరుగులు సాధించి తన క్రికెట్ కెరీర్ కు ముగింపు పలికాడు. రవితేజ ఇప్పటి వరకు 78 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడి 4,722 పరుగులు చేశాడు. 85 లిస్ట్-ఏ మ్యాచ్ లు ఆడి 2,942 పరుగులు చేశాడు. మరోవైపు అండర్-19, ఇండియా-ఏ జట్లకు ఆడేందుకు తనకు అవకాశం కల్పించిన బీసీసీఐకి రవితేజ ధన్యవాదాలు తెలిపాడు.
Raviteja
Hyderabad
Cricketer
Retire

More Telugu News