Janasena: ఆవిర్భావ వేడుక‌ల వేళ‌.. జ‌న‌సేన‌లోకి చేరిక‌లు

kalyani group founder lolla rajesh joins janasena
  • ఆవిర్భావ వేడుక‌ల ఏర్పాట్ల‌లో జ‌న‌సేన‌
  • పార్టీలో చేరిన కళ్యాణి గ్రూప్స్ అధినేత లోళ్ల రాజేష్
  • శ్రీకాకుళం జిల్లాలో పార్టీకి మ‌రింత బ‌లం
ప‌వ‌న్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆధ్వ‌ర్యంలోని జ‌న‌సేన త‌న ఆవిర్భావ వేడుక‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ నెల 14న పార్టీ ఆవిర్భావ వేడుక‌ల‌ను గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి మండ‌లం ఇప్ప‌టం గ్రామంలో ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. జ‌న‌సేన ఆవిర్బావ వేడుక‌లంటేనే.. జ‌న‌సైనికుల్లో ఓ ర‌క‌మైన ఉత్సాహం కనిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఏపీ అసెంబ్లీకి ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో ఈ ద‌ఫా పార్టీ ఆవిర్భావ వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని పార్టీ నేత‌లు భావిస్తున్నారు.

పార్టీ ఆవిర్భావ వేడుక‌ల నేప‌థ్యంలో జ‌న‌సేన‌లో ఓ కొత్త జోష్ క‌నిపిస్తోంది. ఈ జోష్‌కు మరింత మేర ఉత్సాహం నింపేలా శ‌నివారం ఓ ఘ‌ట‌న చోటుచేసుకుంది. జ‌న‌సేన‌లోకి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, కళ్యాణి గ్రూప్స్ అధినేత లోళ్ల రాజేష్ చేరిపోయారు. శనివారం పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ సమక్షంలో ఆయ‌న పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జ‌న‌సేన‌లోకి చేరేందుకు వ‌చ్చిన రాజేష్‌కు పార్టీ కండువా కప్పిన నాదెండ్ల ఆయ‌న‌ను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
Janasena
Pawan Kalyan
Nadendla Manohar
Janasena Formation Day

More Telugu News