Jagan: మంత్రివర్గ విస్తరణపై జగన్ కీలక వ్యాఖ్యలు

Cabinet shuffling will be there says Jagan
  • త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుంది
  • మంత్రి పదవి నుంచి తప్పించిన వారు పార్టీ కోసం పని చేయాలి
  • వారికి జిల్లా ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పగిస్తాం
త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ఏపీ ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. కేబినెట్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ విస్తరణపై క్లారిటీ ఇచ్చారు. మంత్రి పదవి నుంచి తప్పించిన వాళ్లు పార్టీ కోసం పని చేయాలని చెప్పారు. పదవి నుంచి తప్పించిన వారికి జిల్లా ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పగిస్తామని తెలిపారు. అయితే ఇప్పుడున్న మంత్రుల్లో కొందరిని అలాగే కొనసాగిస్తామని చెప్పారు. జగన్ వ్యాఖ్యలతో ప్రస్తుత మంత్రుల్లో టెన్షన్ మొదలైంది. ఎవరుంటారు? ఎవరిని తప్పిస్తారు? అనే ఆందోళన మొదలైంది. మరోవైపు మంత్రి కావాలనే ఆశతో ఉన్న ఆశావహుల్లో ఈ సారైనా అవకాశం దక్కుతుందేమో అనే ఆశాభావం మొదలైంది.
Jagan
YSRCP
Cabinet

More Telugu News