Russia: నేను ఇద్దరు పిల్లల తండ్రిని..: జెలెన్ స్కీ

I am Father of two Zelensky on Biological weapon allegations
  • జీవాయుధాల ఆరోపణలపై వివరణ
  • తమ దేశంలో ఎలాంటి జీవాయుధాలూ లేవని వెల్లడి
  • ప్రపంచం మొత్తానికి తెలుసన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు
జనాన్ని నాశనం చేసి పారేసే జీవాయుధాలను ఉక్రెయిన్ తయారు చేస్తోందన్న రష్యా ఆరోపణలను ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ ఖండించారు. తమ మీదే రివర్స్ లో జీవాయుధాన్ని ప్రయోగించేందుకు, రసాయనిక దాడి చేసేందుకు రష్యా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అలాంటి ప్రయత్నాలు చేస్తే ఆ దేశంపై మరిన్ని ఆంక్షలు తప్పవని ఆయన హెచ్చరించారు. 

‘‘నేను ఓ దేశానికి అధ్యక్షుడిని. ఇద్దరు పిల్లలకు తండ్రిని. జనాన్ని అంతమొందించే వినాశకర జీవాయుధాన్ని నా దేశంలో తయారు చేయలేదు. అది రష్యా సహా ప్రపంచం మొత్తానికి తెలుసు’’ అని అన్నారు. ఉక్రెయిన్ జీవాయుధాలను తయారు చేస్తోందని, దానికి అమెరికానే ఆర్థిక సాయం చేస్తోందని రష్యా రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఇగోర్ కొనషెంకోవ్ ఆరోపణలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే ఆ వార్తలను ఖండిస్తూ జెలెన్ స్కీ ప్రకటన విడుదల చేశారు.
Russia
Ukraine
War
Volodymyr Zelenskyy

More Telugu News