Samantha: సమంత అందమైన పోస్ట్.. వెంకీ కూతురి కామెంట్!

Nagachaitanya Cousin Ashritha Comments To Samantha Post
  • క్రిటిక్స్ చాయిస్ అవార్డు కోసం ముంబైలో సమంత
  • ఎమరాల్డ్ గ్రీన్ డ్రెస్సులో మెరిసిన తార
  • చూడముచ్చటేస్తోందంటూ ఆశ్రిత దగ్గుబాటి కామెంట్
విడాకుల తర్వాత సమంత సినిమాల జోరు పెంచింది. వరుస సినిమాల్లో నటిస్తూ అందరి మన్ననలను అందుకుంటోంది. ఈ క్రమంలోనే క్రిటిక్స్ చాయిస్ ఫిల్మ్ అవార్డ్ ఆమెకు వచ్చింది. ఆ అవార్డును అందుకునేందుకు ఆమె ముంబైలో ఉంది. అవార్డ్ ఫంక్షన్ కోసం ఎమరాల్డ్ గ్రీన్, నలుపు రంగు డ్రెస్సులో తళుక్కున మెరిసింది. కొత్త అందంతో అందరినీ కట్టిపడేసింది. 

ఆ ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో ‘నాకు అత్యంత ఇష్టమైన లుక్కిది’ అంటూ పోస్ట్ చేసిన సమంతకు ఎక్కడలేని అభినందనల కామెంట్లు వచ్చాయి. నాగచైతన్య మేనమామ, హీరో వెంకటేశ్ కుమార్తె దగ్గుబాటి ఆశ్రిత కూడా కామెంట్ చేసింది. ఫుడ్ లవర్ అయిన ఆమె ఇన్ఫినిటీ ప్లాటర్ పేరిట ఇన్ స్టాగ్రామ్ ఖాతాను రన్ చేస్తోంది. ఆ ఖాతా నుంచి 'ముచ్చటేస్తోందంటూ..' ఓ ఎమోజీని పోస్ట్ చేసింది. 

ఇంకా చాలా మంది హీరోయిన్లు కూడా ఆమె ఫొటోకు కామెంట్లు పెట్టారు. చాలా అందంగా ఉన్నావంటూ రష్మిక మందన్న కామెంట్ చేసింది. 'ఎందుకో అలా..' అంటూ సంయుక్త హెగ్డే, 'ఫైర్' అంటూ రుహానీ శర్మ, హన్సికలు కామెంట్ చేశారు. ఆమె అభిమానులు సైతం ఆమెను చూసి ఎంత అందంగా ఉన్నావో అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Samantha
Tollywood
Naga Chaitanya
Ashritha Daggubati
Venkatesh Daggubati

More Telugu News