యూపీలో మేజిక్ ఫిగర్ దాటేసిన బీజేపీ.. కమలం పార్టీకి భారీ విక్టరీ
- 5.30 గంటలకే మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసిన బీజేపీ
- 275 సీట్ల దాకా వచ్చే అవకాశం
- 125 సీట్ల కంటే తక్కువకే పరిమితం కానున్న ఎస్పీ
403 సీట్లు కలిగిన యూపీ అసెంబ్లీలో 202 సీట్లు తెచ్చుకున్న పార్టీ విక్టరీ కొట్టినట్టేనని చెప్పాలి. అయితే గురువారం సాయంత్రం 5.30 గంటలకే బీజేపీ ఏకంగా 208 సీట్లలో విజయం సాధించింది. ఇక సాయంత్రం 6 గంటల సమయానికి బీజేపీ ఏకంగా 223 సీట్లలో విజయం సాధించగా.. ఇంకా 50 సీట్లలో ఆధిక్యంలో ఉంది. ఇక బీజేపీకి గట్టి పోటీ ఇస్తుందనుకున్న సమాజ్ వాదీ పార్టీ 89 సీట్లను గెలుచుకుని ఇంకా 36 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ ట్రెండ్స్‌ను బట్టి చూస్తే..ఇప్పటికే స్పష్టమైన మెజారిటీ సాధించిన బీజేపీ..మరిన్ని సీట్ల గెలుపుతో భారీ విక్టరీనే సాధించనుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.