bjp: 4 రాష్ట్రాల్లో కమలం హవా.. పంజాబ్ ను ‘ఊడ్చేస్తున్న’ ఆప్

Bjp leads in majority states counting continues
  • యూపీలో 199 స్థానాల్లో బీజేపీ ఆధిక్యం
  • ఎస్పీ 99 స్థానాల్లో ముందంజ
  • గోవాలోనూ బీజేపీయే లీడ్
  • ఉత్తరాఖండ్ లో బీజేపీ జోరు
ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టుగానే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తీరు కనిపిస్తోంది. గోవా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు నేడు జరుగుతోంది. 

ఉత్తరప్రదేశ్ లో బీజేపీ గాలీ వీస్తోంది. 403 స్థానాలకు గాను.. ఇప్పటి వరకు వెలువడిన ట్రెండ్స్ ను  పరిశీలిస్తే బీజేపీ 199 స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తోంది. సమాజ్ వాదీ పార్టీ 99 చోట్ల, బీఎస్పీ 6 స్థానాల్లో, కాంగ్రెస్ 4 చోట్ల ముందంజలో ఉన్నాయి.

పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) హవా నడుస్తోంది. 47 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక్కడ సర్కారు ఏర్పాటుకు 59 స్థానాల్లో గెలవాల్సి ఉంటుంది. కాంగ్రెస్ 38, శిరోమణి అకాలీదళ్ 18, బీజేపీ 4 స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తున్నాయి.

గోవాలో బీజేపీ అధికారం దిశగా ప్రయాణిస్తోంది. మొత్తం 40 స్థానాలకు గాను బీజేపీ 17 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ 10 స్థానాల్లో, ఆప్ ఒక్క స్థానంలో లీడ్ లో ఉన్నాయి.

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 70 స్థానాలకు గాను బీజేపీ 34 చోట్ల, కాంగ్రెస్ 18 స్థానాల్లో ఆధిక్యం చూపిస్తున్నాయి. మణిపూర్ రాష్ట్రంలో 60 స్థానాలకు గాను బీజేపీ 23 చోట్ల గెలుపు దిశగా పయనిస్తోంది. కాంగ్రెస్ 14 స్థానాల్లో, ఎన్ పీపీ 13 చోట్ల ఆధిక్యం ప్రదర్శిస్తున్నాయి. 

bjp
state elections
leads
up
goa
Punjab

More Telugu News