బలహీన పడిన వాయుగుండం.. ఏపీలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
- వాయుగుండం బలహీన పడడంతో గాలుల్లో తగ్గిన తేమ
- రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం
- సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతల నమోదు
- కర్నూలులో అత్యధికంగా 37.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
వాయుగుండం బలహీన పడడంతో సముద్రం మీదుగా వచ్చే గాలుల్లో తేమశాతం గణనీయంగా తగ్గింది. ఫలితంగా నిన్న కోస్తా, రాయలసీమల్లోని పలు ప్రాంతాల్లో ఎండ తీవ్రత బాగా పెరిగింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. తుని, అమరావతి, కర్నూలులో అత్యధికంగా 37.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రెండుమూడు రోజుల్లోనూ ఉష్ణోగ్రతలు ఇలానే ఉంటాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.