తెలంగాణలో కొత్తగా 91 మందికి కరోనా... పూర్తి వివరాలు ఇవిగో!

Telangana corona daily bulletin
  • గత 24 గంటల్లో 22,966 కరోనా పరీక్షలు
  • హైదరాబాదులో 40 కొత్త కేసులు
  • కరోనా నుంచి కోలుకున్న 241 మంది
  • ఇంకా 1,375 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 22,966 కరోనా పరీక్షలు నిర్వహించగా, 91 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. హైదరాబాద్ పరిధిలో 40 కొత్త కేసులు నమోదయ్యాయి. 15 జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 241 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడచిన 24 గంటల్లో కరోనాతో ఎలాంటి మరణాలు సంభవించలేదు. 

రాష్ట్రంలో ఇప్పటివరకు 7,89,951 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,84,465 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,375 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో ఇప్పటివరకు 4,111 మంది మృతి చెందారు.
Go Back to Shorts
Telangana
Corona Virus
Daily Bulletin
Today Cases

More Telugu News