Bhagyalakshmi: వైసీపీ ఎమ్మెల్యే భాగ్యలక్షిని హెచ్చరిస్తూ మావోయిస్టుల లేఖ

Maoists warning letter to YSRCP MLA Bhagyalakshmi
  • బాక్సైట్ అక్రమ తవ్వకాలను ప్రోత్సహిస్తున్నారు
  • ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మన్యంను వదిలి వెళ్లాలి
  • లేకపోతే ప్రజా కోర్టులో ప్రజలు శిక్షిస్తారన్న మావోలు 
వైసీపీ పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిని హెచ్చరిస్తూ మావోయిస్టులు లేఖ రాశారు. లేటరైట్ మైనింగ్ ముసుగులో బాక్సైట్ అక్రమ తవ్వకాలను భాగ్యలక్ష్మి ప్రోత్సహిస్తున్నారని లేఖలో మావోలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీకే వీధి మండలం చాపరాతిపాలెంలో జరుగుతున్న మైనింగ్ ను ఆపేయాలని అన్నారు. ఎమ్మెల్యే తక్షణమే తన పదవికి రాజీనామా చేసి, మన్యం ప్రాంతాన్ని విడిచి వెళ్లాలని హెచ్చరించారు. తమ హెచ్చరికను పట్టించుకోకపోతే సివేరి సోమ, కిడారి సర్వేశ్వరరావుల తరహాలోనే ప్రజాకోర్టులో ప్రజలు శిక్షిస్తారని పేర్కొన్నారు.  మావోయిస్టు పార్టీ ఈస్ట్ డివిజన్ కార్యదర్శి అరుణ పేరుతో ఈ లేఖ విడుదలయింది. 
Bhagyalakshmi
YSRCP
Maoist
Warning

More Telugu News