Russia: రష్యా మేజర్ జనరల్‌ను మట్టుబెట్టిన ఉక్రెయిన్ దళాలు

Russian Major General Vitaly Gerasimov killed during battle of Kharkiv
  • ఖార్కివ్‌లో హతమైన జనరల్ విటాలీ గెరసిమోవ్
  • సెంట్రల్ మిలిటరీ డిస్ట్రిక్ట్ 41వ సైన్యానికి మొదటి డిప్యూటీ కమాండర్ 
  • 2014లో విటాలీకి పతకం
  • చాలామంది రష్యా సీనియర్ అధికారులు మరణించారన్న ఉక్రెయిన్
ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో రష్యాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఖార్కివ్‌లో నిన్న రష్యా మేజర్ జనరల్ విటాలీ గెరసిమోవ్‌ను హతమార్చినట్టు ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వశాఖ ప్రకటించింది. మేజర్ జనరల్ విటాలీ గెరాసిమోవ్ రష్యాలోని సెంట్రల్ మిలిటరీ డిస్ట్రిక్ట్ 41వ సైన్యానికి మొదటి డిప్యూటీ కమాండర్. 

రెండో చెచెన్ యుద్ధం, సిరియాలో జరిగిన రష్యన్ సైనిక కార్యకలాపాలలో విటాలీ కీలక పాత్ర పోషించారని ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. అంతేకాదు, 2014లో క్రిమియాను తిరిగి సొంతం చేసుకున్నందుకు ఆయనకు మెడల్ కూడా లభించింది. కాగా, ఈ యుద్ధంలో రష్యాకు చెందిన చాలామంది రష్యన్ సీనియర్ అధికారులు మరణించడమో, గాయపడడమో జరిగిందని ఉక్రెయిన్ రక్షణ శాఖ తెలిపింది.
Russia
Ukraine
Major General Vitaly Gerasimov

More Telugu News