Jagan: జగన్ వ్యాఖ్యలకు అచ్చెన్నాయుడు కౌంటర్

Atchannaidu gives counter to Jagan
  • గవర్నర్ ను టీడీపీ సభ్యులు అడ్డుకోవడం సరికాదన్న జగన్
  • వయసుకు కూడా గౌరవం ఇవ్వలేదని విమర్శ
  • చంద్రబాబును వైసీపీ అవమానించలేదా? అని ప్రశ్నించిన అచ్చెన్న
ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగాన్ని టీడీపీ సభ్యులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. గవర్నర్ గో బ్యాక్ అంటూ వారు నినాదాలు చేశారు. బడ్జెట్ ప్రతులను చించేశారు. ఈ నేపథ్యంలో బీఏసీ భేటీలో అచ్చెన్నాయుడుపై సీఎం జగన్ అసహనం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగాన్ని టీడీపీ సభ్యులు అడ్డుకోడం సరికాదని అన్నారు. గవర్నర్ ఏ ఒక్క పార్టీకి చెందిన వ్యక్తి కాదని చెప్పారు. ఆయన వయసుకైనా గౌరవం ఇవ్వకుండా అవమానించారని అన్నారు. 

మరోవైపు జగన్ వ్యాఖ్యలకు టీడీపీ నేత అచ్చెన్నాయుడు కౌంటర్ ఇచ్చారు. తాము గవర్నర్ ను తప్పుపట్టలేదని, ఆయన తప్పిదాలనే ఎండగట్టామని చెప్పారు. తమ అధినేత చంద్రబాబు పెద్దాయన కాదా? అసెంబ్లీలో ఆయనను వైసీపీ సభ్యులు అవమానించలేదా? అని ప్రశ్నించారు.
Jagan
YSRCP
Atchannaidu
Chandrababu
Telugudesam

More Telugu News