Harish Rao: ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉంటుంది: హరీశ్ రావు

Harish Rao comments on budget session
  • కాసేపట్లో ప్రారంభం కానున్న తెలంగాణ బడ్జెట్ సమావేశాలు
  • మూడోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్న హరీశ్ రావు
  • మానవీయ కోణంలో బడ్జెట్ తయారు చేశామన్న మంత్రి
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఆర్థిక మంత్రి హరీశ్ రావు మూడోసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. శాసనసభలో ఉదయం 11.30 గంటలకు హరీశ్ రావు బడ్జెట్ ను ప్రవేశపెట్టనుండగా, శాసనమండలిలో మంత్రి ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ను ప్రవేశపెడతారు.

 అసెంబ్లీకి వెళ్లేముందు కోకాపేటలోని తన నివాసం వద్ద హరీశ్ రావు మీడియాతో ఆయన మాట్లాడుతూ, ప్రజల ఆకాంక్షలకు, వారికి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు అనుగుణంగా బడ్జెట్ ఉంటుందని చెప్పారు. మానవీయ కోణంలో బడ్జెట్ ను తయారు చేశామని తెలిపారు. అనంతరం ఆయన జూబ్లీహిల్స్ లోని టీటీడీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో మరో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా పాల్గొన్నారు.
Harish Rao
Telangana
Budget Session
TRS

More Telugu News