Gujarat: పెళ్లిలో భోజనం చేసిన 1200 మంది ఆసుపత్రి పాలు!

Over 1200 hospitalised after consuming food at wedding in Gujarat
  • గుజరాత్‌లోని మెహసనా జిల్లాలో ఘటన
  • ఆహారం తీసుకున్న తర్వాత వాంతులు, విరేచనాలతో ఇబ్బందులు
  • ఆహార నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిన పోలీసులు
స్థానిక కాంగ్రెస్ నేత కుమారుడి పెళ్లిలో విందు భోజనం చేసిన 1200 మందికిపైగా అతిథులు ఆసుపత్రి పాలయ్యారు. గుజరాత్‌లోని మెహసనా జిల్లా విస్‌నగర్ తాలూకా సావల గ్రామంలో శుక్రవారం రాత్రి బాగా పొద్దుపోయాక ఈ ఘటన జరిగింది.

పెళ్లిలో ఏర్పాటు చేసిన విందు తీసుకున్న తర్వాత చాలామంది వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి వంటి సమస్యలతో బాధపడ్డారు. వెంటనే వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించారు. విందులో ఏర్పాటు చేసిన ఆహార నమూనాలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌‌కు పంపినట్టు  పోలీసులు తెలిపారు. ఫుడ్ అండ్ డ్రగ్ డిపార్ట్‌మెంట్ కూడా ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. విందులో అతిథులకు వడ్డించిన ఆహార పదార్థాల్లో మాంసాహారం కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
Gujarat
Wedding
Food
Congress

More Telugu News