చెవిటి .. మూగ పాత్రలో సూర్య మరో ప్రయోగం!
- సూర్య తాజా చిత్రంగా 'ఈటి'
- ఈ నెల 10వ తేదీన విడుదల
- బాలాతో కొత్త ప్రాజెక్టు
- కథానాయికగా జ్యోతిక
ఇక ఈ సినిమా తరువాత చేయడానికి వెట్రిమారన్ .. బాలా ప్రాజెక్టులను సూర్య లైన్లో పెట్టాడు. ఈ రెండు సినిమాలను ఆయన ఒకే సమయంలో చేస్తూ వెళతాడు. బాలా అనగానే అది ప్రయోగాత్మక చిత్రమని చెప్పేయవచ్చు. అలాగే ఈ సినిమాలో సూర్య ద్విపాత్రాభినయం చేయనున్నాడని అంటున్నారు.
ఒక పాత్రలో ఆయన చెవిటి - మూగ పాత్రలో కనిపిస్తాడని చెబుతున్నారు. ఈ పాత్ర సరసన కథానాయికగా జ్యోతిక కనిపించనుందని అంటున్నారు. గతంలో సూర్య ద్విపాత్రాభినయం చేసిన 'బ్రదర్స్' .. '24' .. 'సెవెంత్ సెన్స్' సినిమాలకి మంచి ఆదరణ లభించింది. ఈ సారి సూర్య చేస్తున్న ప్రయోగం ఎంతవరకూ ఫలిస్తుందన్నది చూడాలి.