Shane Warne: మిస్ యూ వార్నీ... మిత్రుడి మరణం పట్ల సచిన్ తీవ్ర విచారం

Sachin Tendulker responds to Shane Warne untimely demise
  • ఆసీస్ దిగ్గజం షేన్ వార్న్ అకాలమరణం
  • థాయ్ లాండ్ లో కన్నుమూత
  • విల్లాలో విగతజీవుడిలా కనిపించిన వార్న్
  • నిశ్చేష్టకు గురయ్యానన్న సచిన్
ఆస్ట్రేలియా లెగ్ స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ హఠాన్మరణం పట్ల భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. వార్న్ మరణవార్తతో నిశ్చేష్టకు గురయ్యానని, తీవ్ర విషాదం ముంచెత్తిందని పేర్కొన్నాడు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించాడు. 

"నువ్విక మాతో ఉండవని తెలిసి నిర్ఘాంతపోయాం. భరింపరాని విషాదంలో మునిగిపోయాం. వార్నీ... నువ్వున్న చోట ఎక్కడా విచారం, నిరుత్సాహం అనేవి ఉండేవి కావు... అది మైదానంలో కానీ, వెలుపల కానీ. మైదానంలో నీ బౌలింగ్ ను ఎదుర్కోవడం, బయట మాటల తూటాలు పేల్చుకోవడం ఎప్పటికీ ఓ  పెన్నిధిలా భావిస్తాను. భారత్ లో నీకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. భారతీయుల మదిలోనూ నువ్వెప్పటికీ నిలిచే ఉంటావు... చాలా చిన్న వయసులోనే వెళ్లిపోయావు మిత్రమా!" అంటూ సచిన్ భావోద్వేగభరితంగా స్పందించాడు.
Shane Warne
Sachin Tendulkar
Demise
Cricket
Australia

More Telugu News