Devineni Uma: సీఆర్డీయే చట్టం అమరావతిని కాపాడింది: దేవినేని ఉమ

Devineni Uma says CRDA act saved Amaravathi
  • అమరావతిపై హైకోర్టు సంచలన తీర్పు
  • మాస్టర్ ప్లాన్ అమలు చేయాలని ఆదేశాలు
  • పనులు వెంటనే ప్రారంభించాలని ఉమ డిమాండ్

ఏపీ హైకోర్టు అమరావతి చట్టబద్ధతను గుర్తిస్తూ కీలక తీర్పు వెలువరించిన నేపథ్యంలో, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ స్పందించారు. 800 రోజులకు పైగా అమరావతి రైతులు సాగించిన ఉద్యమాన్ని ఏపీ మొత్తం గుర్తుంచుకుంటుందని తెలిపారు. సీఆర్డీయే చట్టం అమరావతిని కాపాడిందని అన్నారు. హైకోర్టు తీర్పును దృష్టిలో ఉంచుకుని వెంటనే రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

'సేవ్ ఏపీ-బిల్డ్ అమరావతి!'కి టీడీపీ మద్దతిస్తుందని తెలిపారు. పక్కరాష్ట్రం నుంచి తెచ్చుకున్న లాలూచీ నిధులతో అమరావతిని చంపాలనుకున్నారని ఉమ ఆరోపించారు. జగన్ కు పరిపాలన చేతకాక చతికిలబడ్డారని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News