Mahesh Vitta: ప్రియురాలిని పెళ్లాడబోతున్న సినీ నటుడు మహేశ్ విట్టా

Actor Mahesh Vitta to marry his girl friend
  • నాలుగేళ్లుగా రిలేషన్ షిప్ లో ఉన్నామన్న మహేశ్
  • ఆమె తన చెల్లెలి ఫ్రెండ్ అని వెల్లడి
  • ఆగస్ట్ లేదా సెప్టెంబర్ లో పెళ్లి
టాలీవుడ్ లో అంచెలంచెలుగా ఒక స్థాయికి చేరిన నటుడు మహేశ్ విట్టా. తొలి రోజుల్లో అవకాశాల కోసం ఎంతో కష్టపడ్డ ఆయన ఇప్పుడు సొంత నిర్మాణ సంస్థను స్థాపించే స్థాయికి చేరాడు. బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొని ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. త్వరలోనే మహేశ్ ఒక ఇంటివాడు కాబోతున్నాడు. తన ప్రియురాలిని పెళ్లాడబోతున్నాడు.

ఈ అంశంపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మహేశ్ వివరాలను వెల్లడించాడు. ఆమె తన చెల్లెలి స్నేహితురాలని, సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తోందని చెప్పాడు. నాలుగేళ్లుగా తాము రిలేషన్ షిప్ లో ఉన్నామని తెలిపాడు. తొలుత ఆమెను చూసినప్పుడు తన తల్లి ఫేస్ కట్ కనిపించిందని, వెంటనే ప్రపోజ్ చేశానని, పరిచయం కాగానే ప్రపోజ్ చేయడమేంటని ఆమె ప్రశ్నించిందని తెలిపాడు. రెండేళ్ల తర్వాత ప్రేమకు ఓకే చెప్పిందని... గత ఏడాదే తమ ప్రేమ సంగతి ఇద్దరి ఇళ్లలో చెప్పామని వెల్లడించాడు. ఆగస్ట్ లేదా సెప్టెంబర్ లో పెళ్లి చేసుకుంటామని తెలిపాడు.
Mahesh Vitta
Tollywood
Marriage

More Telugu News