Ram Gopal Varma: పవన్ సార్... కాబోయే ప్రధాని చెప్పేది వినండి: రామ్ గోపాల్ వర్మ

RGV asks Pawan Kalyan to listen to would be PM
  • పవన్ ను ఉద్దేశించి వీడియోలో మాట్లాడిన కేఏ పాల్
  • పవన్ ను ప్రజాశాంతి పార్టీలో చేరమన్న పాల్
  • పవన్ ను కావాలంటే సీఎం చేస్తానని వ్యాఖ్య
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ట్విట్టర్ ద్వారా ఏదో ఒక కామెంట్ చేస్తుండటం దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు అలవాటే. ఎప్పుడూ పవన్ కు వ్యతిరేకంగానే ఆయన కామెంట్లు చేస్తుంటాడు. 'భీమ్లా నాయక్' సినిమాపై కూడా పలు ట్వీట్లు చేశాడు. తాజాగా పవన్ కల్యాణ్ గురించి కేఏ పాల్ మాట్లాడిన వీడియోను ఆయన షేర్ చేశాడు. 'హేయ్ పవన్ సార్... కాబోయే ప్రధాని చెప్పేది విను' అని కామెంట్ చేశాడు. 

'పవన్ ఫ్యాన్స్ అందరికీ చెపుతున్నా.. పవన్ సీఎం కావాలన్నా, మినిస్టర్ కావాలన్నా.. ఆయనను ప్రజాశాంతి పార్టీలో చేరమని చెప్పండి. 42 మంది ఎంపీలను గెలిపించుకుందాం. మీరంతా ఓకే అంటే నేను ప్రధానిగా ఉంటా. పవన్ ను కావాలంటే ముఖ్యమంత్రిని చేద్దాం' అంటూ ఆ వీడియోలో పాల్ చెపుతున్నారు.
Ram Gopal Varma
Tollywood
Pawan Kalyan
Janasena
KA Paul

More Telugu News