Ajith: పొలిటికల్ ఎంట్రీపై హీరో అజిత్ స్పందన

Ajith response on political entry
  • అజిత్ రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ వార్తలు
  • తనకు ఆ ఆలోచనే లేదన్న అజిత్
  • ఇలాంటి వార్తలను ప్రోత్సహించవద్దన్న అజిత్ మేనేజర్
తమిళనాడులో సినీతారలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. తమిళనాడును ఎక్కువ కాలం పాలించిన సీఎంలు కరుణానిధి, ఎంజీఆర్, జయలలితలు సినీ పరిశ్రమకు చెందిన వారే. మరోవైపు హీరో అజిత్ రాజకీయాల్లోకి రావాలని ఆయన అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నారనే వార్తలు కూడా ఎన్నోసార్లు వచ్చాయి. ప్రతిసారి ఆ వార్తలను ఆయన ఖండించారు. 

తాజాగా మరోసారి ఆయన ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. తనకు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని తెలిపారు. ఇదే విషయంపై ఆయన పర్సనల్ మేనేజర్ సురేశ్ చంద్ర మాట్లాడుతూ, అజిత్ కు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని చెప్పారు. ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారనే వార్తలను ప్రోత్సహించవద్దని మీడియాను కోరుతున్నామని అన్నారు.
Ajith
Kollywood
Tollywood
Politics

More Telugu News