కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ తో అనుష్క సినిమా!

Anushka in AL Vijay Movie
  • అందాల కథానాయికగా అనుష్కకి పేరు
  • లేడీ ఓరియెంటెడ్ సినిమాతో తిరుగులేని క్రేజ్ 
  • కొంతకాలంగా సినిమాలకి దూరం 
  • మళ్లీ రంగంలోకి దిగుతోందంటూ టాక్  
సాధారణమైన ప్రేక్షకులలోనే కాదు .. ఇతర భాషల్లోని ఆర్టిస్టులను కూడా అభిమానులుగా చేసుకున్న కథానాయికగా అనుష్క కనిపిస్తుంది. ఈ కాలంలో పౌరాణిక .. చారిత్రక చిత్రాలను నిర్మించాలంటే, అందుకు తగిన కనుముక్కు తీరు ఉన్న ఏకైన కథానాయిక అనుష్క అనడంలో ఎంతమాత్రం సందేహం లేదు.

'అరుంధతి' .. 'రుద్రమదేవి' .. 'భాగమతి' వంటి నాయిక ప్రధానమైన సినిమాలు ఆమె నటనాపటిమకు నిదర్శనంగా నిలుస్తాయి. అలాంటి అనుష్క కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది. యూవీ క్రియేషన్స్ లో ఒక సినిమా చేయనుందనే వార్తలైతే వచ్చాయిగానీ, అందుకు సంబంధించిన కదలిక ఎక్కడా కనిపించడం లేదు. 

ఈ నేపథ్యంలోనే తమిళ దర్శకుడు ఎ.ఎల్.విజయ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. ఇది కూడా నాయిక ప్రధానమైన సినిమానే అంటున్నారు. తమిళ స్టార్ డైరెక్టర్స్ జాబితాలో ఎ.ఎల్.విజయ్ పేరు కూడా కనిపిస్తుంది. ఆయన వినిపించిన కథ బాగా నచ్చడం వల్లనే అనుష్క ఒప్పుకుందని అంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.
Go Back to Shorts
Anushka Shetty
AL Vijay
Kollywood

More Telugu News