ఏపీలో మరో 101 కరోనా పాజిటివ్ కేసులు

AP Corona bulletin
  • గత 24 గంటల్లో 9,008 కరోనా టెస్టులు
  • పశ్చిమ గోదావరి జిల్లాలో 28 కేసులు
  • ఇంకా 1,657 మందికి చికిత్స
ఏపీలో గడచిన 24 గంటల్లో 9,008 కరోనా పరీక్షలు నిర్వహించగా, 101 మందికి పాజిటివ్ గా వెల్లడైంది. పశ్చిమ గోదావరి జిల్లాలో 28, అనంతపురం జిల్లాలో 17, గుంటూరు జిల్లాలో 13, తూర్పు గోదావరి జిల్లాలో 12 కొత్త కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. 

అదే సమయంలో 458 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,18,054 మంది కరోనా బారినపడగా, వారిలో 23,01,668 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,657 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో ఇప్పటిదాకా 14,729 మంది మరణించారు.
.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Media Bulletin
Today Cases

More Telugu News