Baba Vanga: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో గెలిచేది ఎవరో చెప్పిన 'బల్గేరియా దైవదూత'

Baba Vanga predictions on Russia and Ukraine war
  • కాలజ్ఞానిగా పేరుగాంచిన బాబా వంగా
  • 1996లో కన్నుమూత
  • ఆమె చెప్పిన విషయాలు జరిగాయంటున్న ప్రజలు
  • పుతిన్ మరింత శక్తిమంతుడు అవుతాడని వెల్లడి
బల్గేరియాకు చెందిన బాబా వంగా ఓ కాలజ్ఞానిగా యూరప్ దేశాల్లో గుర్తింపు పొందారు. ఆమె ఇప్పుడు లేరు. 1996లోనే పరమపదించారు. బాబా వంగాను బల్గేరియా దైవదూతగా అని పిలుస్తుంటారు. ఆమె అసలు పేరు వంగేలియా పాండేవా గుష్టెరోవా. 1911లో బల్గేరియాలో జన్మించింది. అయితే, తన పన్నెండవ ఏట కంటిచూపు కోల్పోయింది. అయితే, తన ఎదుట నిలబడిన వారి వివరాలను, భవిష్యత్తును కచ్చితంగా చెప్పేదని, ఆమె చెప్పిన వాటిలో అత్యధిక శాతం నిజమయ్యాయని యూరప్ దేశాల ప్రజలు విశ్వసిస్తారు. 

అల్ ఖైదా ఉగ్రవాదులు అమెరికా ట్రేడ్ సెంటర్ పై దాడి చేస్తారని బాబా వంగా ముందే చెప్పారని, ఈయూ నుంచి పలు దేశాలు తప్పుకుంటాయని ఆమె చెప్పిన విషయాలు నిజమయ్యాయని యూరప్ దేశాల్లో ప్రచారంలో ఉంది. 

ఇక, ఉక్రెయిన్ ప్రస్తుత పరిస్థితిని బాబా వంగా ఆనాడే ఊహించారట. రష్యా దాడి నుంచి ఉక్రెయిన్ తప్పించుకోవడం అసాధ్యం అని, రష్యా ప్రపంచాధిపత్యం వహించడమే కాకుండా, వ్లాదిమిర్ పుతిన్ సర్వశక్తిమంతుడు అవుతాడని ఆ కాలజ్ఞాని చెప్పారు. యూరప్ ఖండం ఒక బంజరు భూమిలా మారిపోతుందని, రష్యా మాత్రం మహోజ్వలంగా వెలిగిపోతుందని ఆమె సెలవిచ్చారు.
Baba Vanga
Russia
Ukraine
Bulgeria

More Telugu News