ఉక్రెయిన్, రష్యా యుద్ధంపై హీరో రామ్ స్పందన!
- తీవ్ర రూపం దాల్చిన యుద్ధం
- ఉక్రెయిన్ నుంచి రావడానికి అవస్థలు పడుతున్న జనం
- సొంత పౌరులను తీసుకురావడానికి అక్కడ కాలు మోపాలన్న రామ్
ఈ క్రమంలో యుద్ధం భీకర రూపు దాల్చింది. యుద్ధం వల్ల పెద్ద సంఖ్యలో అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరోవైపు యుద్ధం ఆగిపోవాలని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఆకాంక్షిస్తున్నారు. అక్కడ చిక్కుకున్న అందరూ సురక్షితంగా బయటపడాలని కోరుకుంటున్నారు.
టాలీవుడ్ హీరో రామ్ కూడా యుద్ధంపై స్పందించాడు. యుద్ధం కోసం తమ సైన్యాన్ని ఇతర దేశాల్లోకి నేరుగా పంపడం సరైన చర్య కాకపోవచ్చు... కానీ, తన పౌరులను సురక్షితంగా అక్కడి నుంచి తీసుకురావడానికి అక్కడ కాలు మోపడం వారి కనీస బాధ్యత అని ట్వీట్ చేశాడు.