బీజేపీ నేత జితేందర్ రెడ్డి ఇంటిలో నలుగురి కిడ్నాప్
- ఢిల్లీ సౌత్ ఎవెన్యూలో నివాసం ఉంటున్న జితేందర్‌రెడ్డి
- జితేందర్ రెడ్డి డ్రైవర్ సహా నలుగురి కిడ్నాప్
- సౌత్ ఎవెన్యూ పోలీసులకు ఫిర్యాదు, కేసు నమోదు చేయని పోలీసులు
ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ సౌత్ ఎవెన్యూలోని నెంః105 ఇంటిలో జితేందర్ రెడ్డి నివాసం ఉంటున్నారు. మంగళవారం మధ్యాహ్నం తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు ఆ ఇంటి ప్రాంగణంలోకి ప్రవేశించి జితేందర్ రెడ్డి కారు డ్రైవర్ సహా నలుగురు వ్యక్తులను బలవంతంగా లాక్కెళ్లారట. ఈ హఠాత్పరిణామం నుంచి తేరుకున్న జితేందర్ రెడ్డి వ్యక్తిగత సిబ్బంది సమీపంలోని పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేయాలని జితేందర్ రెడ్డి వ్యక్తిగత సిబ్బంది పోలీసులను కోరారట.