టాలీవుడ్ లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్న సీనియర్ నటి
- మళ్లీ వస్తున్న అర్చన
- గతంలో నిరీక్షణ వంటి చిత్రాలతో అలరించిన నటి
- చోర్ బజార్ చిత్రం ద్వారా రీఎంట్రీ
- ఆకాష్ పూరి హీరోగా చోర్ బజార్
ఇటీవల కాలంలో టాలీవుడ్ లో సీనియర్ నటీమణుల సెకండ్ ఇన్నింగ్స్ దిగ్విజయంగా సాగుతోంది. ఇప్పటికే నదియా వంటి తారలు కీలకపాత్రల్లో నటిస్తూ అభిమానులను అలరిస్తున్నారు. చోర్ బజార్ చిత్రంతో అర్చన కూడా మళ్లీ టాలీవుడ్ లో బిజీ అయ్యే అవకాశాలున్నాయి. చోర్ బజార్ చిత్రానికి జార్జి రెడ్డి ఫేమ్ జీవన్ రెడ్డి దర్శకుడు. ఆకాష్ పూరి సరసన గెహనా సిప్పీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం సెట్స్ పై ఉంది.