Prabhas: 'ఆది పురుష్' విషయంలో అభిమానుల అసహనం!

Adi Purush movie Update

  • ప్రభాస్ పౌరాణిక చిత్రంగా 'ఆది పురుష్'
  • సీతాదేవి పాత్రలో కృతి సనన్ 
  • వీఎఫ్ ఎక్స్ పనుల్లో సినిమా 
  • దీపావళి రిలీజ్ కూడా డౌటే

ప్రభాస్ కథానాయకుడిగా 'ఆది పురుష్' రూపొందుతోంది. భూషణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకి ఓమ్ రౌత్ దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన వీఎఫ్ ఎక్స్ పనులు జరుగుతున్నాయి. ప్రభాస్ - కృతి సనన్ సీతారాములుగా నటించిన ఈ సినిమాలో రావణుడిగా సైఫ్ అలీఖాన్ కనిపించనున్నాడు. 

భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్టు 11వ తేదీన విడుదల చేయనున్నట్టుగా చెప్పారు. ఆ తరువాత విడుదల తేదీని వాయిదా వేశారు. ఈ సినిమాను దీపావళి కానుకగా అక్టోబర్ లో విడుదల చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. దాంతో ఆ సమయం కోసం అభిమానులంతా వెయిట్ చేస్తున్నారు. 

అయితే తాజా ఇంటర్వ్యూలో భూషణ్ కుమార్ మాట్లాడుతూ .. "ఈ సినిమా దీపావళికి వస్తుందనే విషయంలో ఎంతమాత్రం నిజం లేదు. అసలు ఈ సినిమా రిలీజ్ విషయంలో మేము ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు" అని చెప్పారు. దాంతో దీపావళికి కూడా ఈ సినిమా రాదా?! అంటూ అభిమానులు నిరాశ చెందుతున్నారు .. అసహనానికి లోనవుతున్నారు.

  • Loading...

More Telugu News