Yadlapati Venkatarao: టీడీపీ సీనియర్ నేత యడ్లపాటి వెంకట్రావు కన్నుమూత

TDP Senior leader Yadlapati Venkatarao passed away
  • గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న యడ్లపాటి
  • వయసు 102 సంవత్సరాలు
  • ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యుడిగా, మంత్రిగా సేవలు
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, శతాధిక వృద్ధుడు అయిన యడ్లపాటి వెంకట్రావు (102) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో నిన్న ఉదయం తుదిశ్వాస విడిచారు. సంగం డెయిరికీ వ్యవస్థాపక అధ్యక్షుడు అయిన యడ్లపాటి ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా సేవలు అందించారు. 1967, 1972 ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ తరపున, 1978 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున వేమూరు ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు.

1978-80 మధ్య కాలంలో మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో వ్యవసాయశాఖ మంత్రిగా పనిచేశారు. 1983లో టీడీపీలో చేరిన యడ్లపాటి ఆ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేశారు. యడ్లపాటి మృతి విషయం తెలిసి పలువురు రాజకీయ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
Yadlapati Venkatarao
TDP
Congress
Andhra Pradesh

More Telugu News