Mano Thangaraj: కర్రసాము చేసిన తమిళనాడు ఐటీ మంత్రి... వీడియో ఇదిగో!

Tamilnadu IT Minister Mano Thangaraj performs ancient fighting skill
  • నాగర్ కోయిల్ లో ప్రాచీన విద్యల పోటీలు
  • హాజరైన మంత్రి మనో తంగరాజ్
  • కర్ర పట్టుకుని బరిలో దిగిన వైనం
  • సోషల్ మీడియాలో సందడి చేస్తున్న వీడియో
తమిళనాడులోని నాగర్ కోయిల్ లో ప్రాచీన యుద్ధ కళా విద్యల పోటీలు నిర్వహిస్తున్నారు. లెమురియా వర్మకళారి ఆదిమురై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతున్నాయి. కాగా, ఈ కార్యక్రమానికి తమిళనాడు ఐటీ మంత్రి మనో తంగరాజ్ హాజరయ్యారు. 

సంప్రదాయ పంచెకట్టుతో విచ్చేసిన ఆయన బరిలో దిగి కర్రసాముతో అలరించారు. మంత్రి ఎంతో వేగంగా కర్రసాము చేయడం చూసి అక్కడి వారు ఆశ్చర్యపోయారు. సింగిల్ హ్యాండ్, డబుల్ హ్యాండ్ విన్యాసాలతో మంత్రి మనో తంగరాజ్ ఎంతో ఉత్సాహంగా కదిలారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన తన ట్విట్టర్ అకౌంట్ లో పంచుకున్నారు. 

కాగా, లెమురియా ఫౌండేషన్ లో ఆదిమురై, సిలంబం, వర్మమ్, ఆదిమురై యోగా, కలరి, పరై ఇసై వంటి ప్రాచీన విద్యల్లో శిక్షణ ఇస్తారు. శిక్షణ పొందిన వారి మధ్య పోటీలు కూడా నిర్వహిస్తుంటారు.
Mano Thangaraj
KarraSaamu
Kalari
Nagarcoil
IT Minister
Tamilnadu

More Telugu News