ముంబై చేరిన విమానం.. విద్యార్థులకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్వాగతం
- ఎంబసీ సూచనలు పాటిస్తూ రొమేనియా సరిహద్దు చేరుకున్న భారతీయులు
- వారిని ఎయిరిండియా విమానం ఎక్కించిన అధికారులు
- సురక్షితంగా ముంబై చేరుకున్న విమానం
భారత విదేశాంగ శాఖ సూచనలను అనుసరిస్తూ ఉక్రెయిన్లో చిక్కుకున్న భారత విద్యార్ధుల్లో 219 మంది రొమేనియా సరిహద్దులకు చేరుకున్నారు. వీరిని అప్పటికే అక్కడ సిద్ధంగా ఉంచిన ఎయిరిండియా విమానంలో ఎక్కించారు. ఆ వెంటనే టేకాఫ్ తీసుకున్న విమానం.. కాసేపటి క్రితం ముంబై ఎయిర్ పోర్టులో ల్యాండైంది. యుద్ధం నేపథ్యంలో భీతావహ పరిస్థితులను కళ్లారా చూసిన భారత విద్యార్థులు ముంబైకి చేరుకోగానే ఊపిరిపీల్చుకున్నారు.