త్రివిక్రమ్ గారి ఆ మాటే నాకు గుర్తుంది: 'భీమ్లా నాయక్' డైరెక్టర్
- నిన్న విడుదలైన 'భీమ్లా నాయక్'
- తొలి ఆటతోనే సక్సెస్ టాక్
- సక్సెస్ మీట్ నిర్వహించిన టీమ్
- త్రివిక్రమ్ కి థ్యాంక్స్ చెప్పిన దర్శకుడు
"సితార బ్యానర్ వారు .. పవన్ గారు .. రానా గారు .. తమన్ గారు వీరందరినీ హారంలో దారంలా కలుపుతూ మమ్మల్ని ముందుకు నడిపించిన వ్యక్తి త్రివిక్రమ్ గారు. ఆయన నుంచి నేను చాలా విషయాలను నేర్చుకున్నాను. ఆయన ఈ సినిమాకి అందించిన సహాయ సహకారాలను గురించి చెప్పడానికి మాటలు చాలవు.
'అయ్యప్పనుమ్ కోషియుమ్' సినిమా రీమేక్ గా 'భీమ్లా నాయక్'లో మార్పులు చేయాలనుకుని కూర్చున్నాము. "ఏ స్థాయిలో మనం ఈ సినిమాలో మార్పులు చేయాలంటే, ఈ సినిమా రీమేక్ అనే విషయం మరిచిపోయి .. వేరే భాషల వాళ్లు దీని రీమేక్ రైట్స్ కోసం అడగాలి" అని త్రివిక్రమ్ గారు అన్నారు. ఆ మాటలు గుర్తుపెట్టుకునే నేను ముందుకు వెళ్లాను అని చెప్పుకొచ్చాడు.