కాంగ్రెస్‌కు రాజీనామా చేయడం లేదు: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి
- అనుచరులు, నియోజకవర్గ నేలతో జగ్గారెడ్డి భేటీ
- కాంగ్రెస్‌లోనే కొనసాగుదామంటూ నేతల విజ్ఞప్తి
- త్వరలోనే సోనియా, రాహుల్‌లను కలుస్తానన్న జగ్గారెడ్డి
- ఆ తర్వాతే రాజీనామాపై నిర్ణయమని ప్రకటన
అయితే ముందుగానే నిర్ణయించుకున్న ప్రకారం తన నియోజకవర్గానికి చెందిన పార్టీ నేతలు, ముఖ్య అనుచరులతో శుక్రవారం నాడు జగ్గారెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో తన భవిష్యత్తు కార్యాచరణపై చర్చ జరిగింది. మెజారిటీ నేతలు.. కాంగ్రెస్‌లోనే కొనసాగాలంటూ జగ్గారెడ్డికి సూచించారు. మరికొందరైతే కాంగ్రెస్‌లో ఉంటేనే తాము మీ వెంట ఉంటామంటూ జగ్గారెడ్డికి తేల్చి చెప్పారట.
భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి తాను కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికిప్పుడు రాజీనామా చేయడం లేదని ప్రకటించారు. అంతేకాకుండా తాను టీఆర్ఎస్‌లోనో, బీజేపీలోనో చేరేది లేదని కూడా తేల్చిచెప్పారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను త్వరలోనే కలుస్తానని, వారితో మాట్లాడిన తర్వాతే రాజీనామాపై నిర్ణయం తీసుకుంటానని ఆయన తెలిపారు. సోనియా,రాహుల్ ల నుంచి తనకు సానుకూల స్పందన రావాలని దేవుడిని ప్రార్ధిస్తున్నట్లుగా జగ్గారెడ్డి తెలిపారు. మొత్తంగా జగ్గారెడ్డి రాజీనామా టీ కాంగ్రెస్‌లో ఈ మాదిరిగా ఒక్కసారిగా చల్లారిపోయిందన్న మాట.