'భీమ్లా నాయక్' బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయం: వెంకటేశ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'భీమ్లా నాయక్' బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయం: వెంకటేశ్

Bheemla Nayak movie update
  • రేపు రిలీజ్ అవుతున్న 'భీమ్లా నాయక్'
  • అంచనాలు పెంచుతూ వచ్చిన అప్ డేట్లు
  • ఇండస్ట్రీ నుంచి ప్రముఖుల స్పందన
  • ఎగ్జైటింగ్ గా ఉందన్న వెంకీ
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో 'భీమ్లా నాయక్' రూపొందింది. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాలో మరో ప్రధానమైన పాత్రను రానా పోషించాడు. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి హీరో వెంకటేశ్ స్పందించారు.

''భీమ్లా నాయక్ రిలీజ్ పై చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాను. ఎప్పుడెప్పుడు థియేటర్లకు వస్తుందా అని ఎదురుచూస్తున్నాను. ఈ సినిమా నుంచి వదిలిన ప్రోమోలు .. ట్రైలర్లు ఫెంటాస్టిక్ గా వచ్చాయి. ఈ సినిమాతో పవన్ .. రానా ఇద్దరూ కూడా బ్లాక్ బస్టర్ హిట్లు అందుకుంటారని ఆశిస్తున్నాను" అంటూ ఆయన ట్విట్టర్లో రాసుకొచ్చారు.

ఇక సినిమా విషయానికి వస్తే, మొదటి నుంచి కూడా పవన్ .. రానా గొడవపడే సన్నివేశాలపైనే టీజర్లు .. ట్రైలర్లు కట్ చేస్తూ వచ్చారు. ఏ విషయంగా వాళ్లిద్దరూ గొడవపడుతున్నారా అని అంతా అనుకున్నారు. ఇది అహంకారానికీ .. ఆత్మాభిమానానికి మధ్య జరిగే యుద్ధం అంటూ పవన్ క్లారిటీ ఇచ్చేడంతో మరింతగా అంచనాలు పెరిగిపోతున్నాయి.
Pavan Kalyan
Rana Daggubati
Bheemla Nayak Movie
Venkatesh Daggubati

More Telugu News