త్రివిక్రమ్ లేకపోతే 'భీమ్లా నాయక్' లేదు: పవన్
- ఈ నెల 25వ తేదీన 'భీమ్లా నాయక్' రిలీజ్
- నిన్న రాత్రి జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్
- భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు
- త్రివిక్రమ్ పై ప్రశంసలు కురిపించిన పవన్
ఈ వేదికపై పవన్ కల్యాణ్ మాట్లాడుతూ .. "ఇది 'అయ్యప్పనుమ్ కోషియుమ్' అనే మలయాళ సినిమాకి రీమేక్. ఇక పోలీస్ ఆఫీసర్ కీ .. రాజకీయంగా ఎదగాలనుకునే ఒక వ్యక్తికి మధ్య జరిగే కథ. అహంకారానికీ .. ఆత్మాభిమానానికి మధ్య జరిగే యుద్ధం. ఈ సినిమాకి త్రివిక్రమ్ వెన్నెముకలా నిలిచారు. మూలాధారం నుంచి సహస్రారం వరకూ అంతా ఆయనే. త్రివిక్రమ్ లేకపోతే ఈ సినిమా లేదు.
రానాతో పాటు అంతా కూడా ఎవరి పాత్రలను వారు అద్భుతంగా పోషించారు. సితార వారు అనుకూలంగా షెడ్యూల్స్ వేయిస్తూ నాకు ఎంతో మద్దతును ఇచ్చారు. నా సినిమాలను ఆదరించమని అడిగే అలవాటు నాకు లేదు. ఈ సినిమా మీకు ఆనందాన్ని కలిగిస్తే అదే నాకు సంతోషం" అని చెప్పుకొచ్చారు.