తెలంగాణలో క‌రోనా మ‌ర‌ణాలు నిల్‌!.. కొత్త‌గా 348 కేసులు

no Corona deaths in Telangana
  • క‌రోనా కార‌ణంగా ఒక్క‌రూ చ‌నిపోలేదు
  • జీహెచ్ఎంసీ ప‌రిధిలో 93 కేసులు
  • 4,396 మందికి క‌రోనా నుంచి విముక్తి
తెలంగాణలో క‌రోనా మ‌రింత‌గా శాంతించింది. బుధ‌వారం నాడు ఒక్క మ‌ర‌ణం కూడా సంభ‌వించ‌లేదు. గడచిన 24 గంటల్లో 38,580 శాంపిల్స్ పరీక్షించగా, 348 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 93 కొత్త కేసులు నమోదు అయ్యాయి.

అదే సమయంలో 429 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒక్క మ‌ర‌ణం కూడా న‌మోదు కాలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,87,785 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,79,279 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,396 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో ఇప్ప‌టిదాకా మరణించిన వారి సంఖ్య 4,110గా ఉండ‌గా.. బుధ‌వారం ఒక్క మ‌ర‌ణం కూడా సంభ‌వించ‌ని కార‌ణంగా ఈ సంఖ్య‌లో ఎలాంటి మార్పు లేదు.
Go Back to Shorts
Corona Virus
Telangana
GHMC

More Telugu News