Andhra Pradesh: ఉద్యోగుల జీతం నుంచి రికవరీని తీవ్రంగా పరిగణిస్తామంటూ ఏపీ సర్కారుకు హైకోర్టు హెచ్చరిక

High Court Warns AP Government On PRC GOs
  • పీఆర్సీ జీవోలపై ఇవాళ విచారణ
  • కౌంటర్ వేయాలని సర్కారుకు ఆదేశం
  • ఆ జీవోల కాపీలను పిటిషనర్ కు ఇవ్వాలని ఆదేశాలు
ఉద్యోగుల జీతాల నుంచి సొమ్మును ఐఆర్ పేరిట రికవర్ చేస్తే తీవ్రంగా పరిగణిస్తామని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు హెచ్చరించింది. ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ జీవోలపై ఇవాళ హైకోర్టు విచారించింది. పీఆర్సీ జీవోల కాపీలను పిటిషనర్ కు ఇవ్వాలని, పిటిషన్ పై కౌంటర్ తో పాటు పీఆర్సీ నివేదికను దాఖలు చేయాలని సర్కారును ఆదేశించింది. విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది.

పీఆర్సీలో ఉద్యోగుల ప్రయోజనాలను తగ్గించడం పట్ల ఏపీ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వి. కృష్ణయ్య గతనెలలో హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై ఇదివరకే విచారణ జరిపిన హైకోర్టు.. ఏ ఉద్యోగి జీతం నుంచీ రికవర్ చేయొద్దని ఆదేశించింది.
Andhra Pradesh
PRC
High Court
AP High Court

More Telugu News