Tollywood: కీరవాణి తనయుడు హీరోగా ‘దొంగలున్నారు జాగ్రత్త’.. ఆసక్తికరంగా ఫస్ట్ లుక్ పోస్టర్

Sri Simha To Play Lead In Dongalunnaru Jagratha
  • శ్రీసింహ పుట్టిన రోజు సందర్భంగా విడుదల
  • సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాణం
  • సతీశ్ త్రిపుర డైరెక్షన్ లో సినిమా
  • సంగీత దర్శకుడిగా కాల భైరవ
ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీ సింహ హీరోగా మరో ఆసక్తికరమైన సినిమా రాబోతోంది. సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కనున్న ‘దొంగలున్నారు జాగ్రత్త’ సినిమాలో లీడ్ రోల్ ను పోషించబోతున్నాడు. ఇవాళ అతడి పుట్టిన రోజు సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

సినిమాను సతీశ్ త్రిపుర డైరెక్ట్ చేయనున్నాడు. సినిమా కథనూ అతడే రూపొందించాడు. సురేశ్ బాబు, తాటి సునీతలు సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నారు. మంజర్ స్టూడియోస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. శ్రీ సింహ సోదరుడు కాలభైరవ స్వరాలను సమకూర్చనున్నాడు. ఎడిటర్ గా గ్యారీ బి.హెచ్, సినిమాటోగ్రాఫర్ గా యశ్వంత్ సి వ్యవహరించనున్నారు.

కాగా, 2019లో వచ్చిన ‘మత్తు వదలరా’ సినిమాతో శ్రీసింహ హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ సినిమాకు సైమా బెస్ట్ మేల్ డెబ్యూ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు. అంతకుముందు ఎన్టీఆర్ 'యమదొంగ' సినిమాలో చిన్నప్పటి ఎన్టీఆర్ గా చైల్డ్ ఆర్టిస్ట్ రోల్ పోషించాడు.
Tollywood
Sri Simha
Keeravani
Dongalunnaru Jagratha

More Telugu News