: కేజీహెచ్ లో లోకాయుక్త తనిఖీలు

విశాఖ కేజీహెచ్ లో మౌలిక వసతులపై పలు ఫిర్యాదులు వస్తుండడంతో ఉపలోకాయుక్త ఎంవీఎస్ కృష్ణారావు తనిఖీలు నిర్వహించారు. కేజీహెచ్ లోని గైనిక్ వార్డు, చిన్నపిల్లల వార్డు సహా పలు వార్డులను సందర్శించి వసతులను పరిశీలించారు. విద్యుత్ సమస్యలతో పసిపిల్లలు సమస్యలు ఎదుర్కొంటున్నారని, బాలింతలకు బెడ్ లు సరిపోవడం లేదని, ఇక్కడికి వచ్చిన రోగులను ప్రైవేటు ఆసుపత్రులకు సిఫారసు చేస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదులపై ఆరా తీసారు. వైద్యుల తీరుతో గతంలోని సమస్యలు ఏవైనా పునరావృతమవుతున్నాయా? అని పలువుర్ని అడిగి తెలుసుకున్నారు. ఎవరైనా కేజీహెచ్ లోని మౌలిక వసతులపై ఫిర్యాదుచేస్తే తగిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

More Telugu News