: శాంసంగ్ మెగా స్మార్ట్ ఫోన్లు విడుదల

గెలాక్సీ మెగా స్మార్ట్ ఫోన్లను శాంసంగ్ ఈ రోజు దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఒకటి 6.3, మరొకటి 5.8 అంగుళాల స్క్రీన్లతో తీసుకొచ్చింది. 6.3 అంగుళాల స్క్రీన్ మోడల్ లో ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ వెర్షన్, 8 మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 1.9 పిక్సెల్స్ ముందు కెమెరా, వైఫై, బ్లూటూత్, 8జీబీ ఇంటర్నల్ మెమొరీ, 1.5జీబీ ర్యామ్, 1.7 గిగాహెడ్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్ తదితర సదుపాయాలు ఉన్నాయి. ఇక, 5.8 అంగుళాల స్క్రీన్ గల మోడల్ లో కూడా పై సదుపాయాలన్నీ ఉన్నాయి. కాకపోతే ఇది డ్యుయల్ సిమ్ మోడల్. 6. 3 అంగుళాల స్క్రీన్ మోడల్ ధర రూ.31,490, 5.8 అంగుళాల స్క్రీన్ మోడల్ ధర రూ.25,100గా కంపెనీ వెల్లడించింది.

More Telugu News