ఏపీలో మరో 244 మందికి కరోనా పాజిటివ్
- గత 24 గంటల్లో 18,803 కరోనా పరీక్షలు
- తూర్పు గోదావరి జిల్లాలో 47 కొత్త కేసులు
- రాష్ట్రంలో ఇద్దరి మృతి
- ఇంకా 5,565 మందికి చికిత్స
అదే సమయంలో 662 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,16,711 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 22,96,430 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 5,565 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,716కి పెరిగింది.