ఓ రోజు ముందుగానే ఐపీఎల్ సీజ‌న్‌
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఓ రోజు ముందుగానే ఐపీఎల్ సీజ‌న్‌

ipl 2022 will begin on merch 26
  • మార్చి 27న సీజ‌న్‌ను మొద‌లుపెట్టేందుకు తొలుత నిర్ణ‌యం
  • స్టార్ ఇండియా కోరిక మేర‌కు 26న సీజ‌న్ షురూ
  • రెండు, మూడు రోజుల్లో అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశం
ప్ర‌పంచ క్రికెట్‌లో విశేషాద‌ర‌ణ పొందిన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) తాజా సీజ‌న్‌కు రంగం సిద్ధ‌మైపోయింది. ఇప్ప‌టికే ఆట‌గాళ్ల వేలం పూర్తి కాగా.. వ‌చ్చే నెల చివ‌ర‌లో ఈ సీజ‌న్ ప్రారంభం కానుంది. వాస్త‌వానికి ఈ ఏడాది ఐపీఎల్ సీజ‌న్‌ను మార్చి 27న ప్రారంభించాల‌ని బీసీసీఐ నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఐపీఎల్ అధికారిక బ్రాడ్ కాస్ట‌ర్‌గా ఉన్న స్టార్ ఇండియా అభ్య‌ర్థ‌న మేర‌కు ఓ రోజు ముందుగానే సీజ‌న్‌ను ప్రారంభించేందుకు బీసీసీఐ సిద్ధ‌మైపోయిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

బీసీసీఐకి చెందిన ఓ అధికారి ఇచ్చిన స‌మాచారం మేర‌కు ముందుగా అనుకున్న మార్చి 27కు ఓ రోజు ముందుగా అంటే మార్చి 26న‌ సీజ‌న్‌ను మొద‌లుకానుంది. మార్చి 26వ తేదీ (శ‌నివారం) లీగ్‌ను ప్రారంభిస్తే తర్వాతి రోజయిన‌ ఆదివారం డబుల్ హెడర్(రెండు మ్యాచ్‌లు) జరిపే వీలుంటుందని స్టార్ ఇండియా ఈ ప్ర‌తిపాద‌న‌ను తెర‌పైకి తెచ్చిన‌ట్లు బీసీసీఐ ప్ర‌తినిధి తెలిపారు. ఈ విష‌యానికి సంబంధించి మ‌రో రెండు, మూడు రోజుల్లో అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని స‌ద‌రు అధికారి పేర్కొన్నారు. అదే రోజు లీగ్ షెడ్యూల్‌ను కూడా ప్రకటించేందుకు బీసీసీఐ క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్లు స‌మాచారం.
ipl
ipl2022
bcci
star india

More Telugu News