Krithi Shetty: కోపం వచ్చినా వెనక్కి తగ్గిన కృతి శెట్టి!

Krithi Shetty Upcoming Movies
  • యూత్ లో కృతి శెట్టికి విపరీతమైన క్రేజ్
  • ఇప్పటికే హ్యాట్రిక్ హిట్ అందుకున్న బ్యూటీ
  • రిలీజ్ కి రెడీగా 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'
  • ముగింపు దశలో 'ది వారియర్'  
ఈ మధ్య కాలంలో తెలుగు తెరకి పరిచయమైన అందాల కథానాయికగా, వరుస సినిమాలతో .. విజయాలతో కెరియర్ ను పరిగెత్తిస్తున్న కథానాయికగా కృతి శెట్టిని గురించి చెప్పుకోవచ్చు. 'ఉప్పెన'తో తన కెరియర్ ను మొదలుపెట్టిన ఈ బ్యూటీ, 'బంగార్రాజు'తో హ్యాట్రిక్ హిట్ ను సొంతం చేసుకుంది. 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమాతో త్వరలో ప్రేక్షకులను పలకరించనుంది.

అయితే కృతి శెట్టి షూటింగ్స్ కి సమయానికి రావడం లేదనీ, తన తోటి ఆర్టిస్టుల పట్ల ఆమె ధోరణి  మర్యాద పూర్వకంగా ఉండటం లేదనే ప్రచారం కొన్ని రోజులుగా జరుగుతోంది. ఊరుకున్న కొద్దీ ఈ ప్రచారం ఊపందుకుంటూ ఉండటంతో, ఈ ప్రచారానికి మీడియా ముఖంగా తెరదించాలని ఆమె నిర్ణయించుకుందట.

అయితే కెరియర్ ఆరంభంలో ఇలాంటి రూమర్స్ పుట్టుకొస్తూనే ఉంటాయనీ, వాటికి సంజాయిషీ ఇస్తూ పోతే అదే అలవాటు అవుతుందని సన్నిహితులు నచ్చజెప్పారట. ఇలాంటి పుకార్లను లైట్ తీసుకుని వదిలేయమని వాళ్లంతా చెప్పడంతో కృతి శెట్టి కూల్ అయిందని అంటున్నారు. ఇక రామ్ తో ఆమె చేస్తున్న 'ది వారియర్' సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే.
Krithi Shetty
Sudheer Babu
Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie

More Telugu News