హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి షర్మిల.. కాసేపట్లో జగన్, చంద్రబాబు కూడా
- ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పార్ధివ దేహానికి ప్రముఖుల నివాళులు
- అపోలోకు చేరుకున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
- తాడేపల్లి నుంచి బయలుదేరిన జగన్
మరోవైపు, తన కార్యక్రమాలన్నింటినీ వాయిదా వేసుకున్న ఏపీ సీఎం జగన్ తాడేపల్లి నుంచి హైదరాబాద్ బయలుదేరారు. కాసేపట్లో హైదరాబాద్ చేరుకుని అపోలో ఆసుపత్రికి వెళ్లి మేకపాటి గౌతం రెడ్డి పార్ధివ దేహాన్ని సందర్శిస్తారు. అలాగే, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా కాసేపట్లో అపోలో ఆసుపత్రికి వెళ్లనున్నారు.
'ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, వైసీపీ నేత మేకపాటి గౌతమ్ రెడ్డి గారి హఠాన్మరణ వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ... వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను' అని చంద్రబాబునాయుడు ట్వీట్ చేశారు.