: జూలైలో సంచలన నిజాలు: శంకర్రావు
కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు మరోమారు సంచలన వ్యాఖ్యలు, ఆరోపణలతో వెలుగులోకి వచ్చారు. తన ఫోన్ ను ట్యాప్ చేస్తున్నారని, దీని వెనుక ముఖ్యమంత్రి, డీజీపీ హస్తముందని ఆరోపించారు. జూలైలో సంచలన నిజాలు బయటకు వస్తాయంటూ మరోమారు ఆసక్తిని రేకెత్తించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులే స్వయంగా రాజీనామా చేసి పార్టీకి మేలు చేయాలని పిలుపునిచ్చారు.